NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అవినీతి మరక లేని నాయకుడు లబ్బి…

1 min read

– దళితుల భూములుదోచుకున్న చరిత్ర మీ నాయకులది.

– మాజీ ఎమ్మెల్యే లబ్బిని విమర్శించే స్థాయి జయసూర్య కు  లేదు.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  మీ నాయకుడు అక్రమంగా కొనుగోలు చేసిన భూములు చెల్లవు అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అలాంటి అవినీతి నాయకుడి మెప్పుకోసం ఎలాంటి అవినీతి చరిత్ర లేని నాయకుడు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి ని విమర్శించే స్థాయి నీకు లేదని నోరు అదుపులో పెట్టుకోవాలని మాజీ సర్పంచి వైవీ రమణ టీడీపీ నాయకుడు రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జయసూర్య ను హెచ్చరించారు.గురువారం నందికొట్కూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మీ నాయకుడు మాండ్ర శివానంద రెడ్డి కి ఉద్యోగం ఇచ్చి బిక్ష పెట్టింది మాజీమంత్రి  బైరెడ్డి శేష శయన రెడ్డి కాదా అని ప్రశ్నించారు. నకిలీ పత్రాలను సృష్టించి గండిపేట్ మండలంలోని మంచిరేవుల గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 393/1, 393/20 లలోని 143.30 ఎకరాల ప్రభుత్వ భూమి తమదేనంటూ నకిలీ పత్రాలను సృష్టించి స్వాధీనపరుచుకోవడానికి ప్రయత్నం చేసింది వాస్తవం కాదా అన్నారు.ఈ ఘటనకు సంబంధించి సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. టీడీపీలో నీ విలువ ఏంటో తెలుసుకుని మాట్లాడు అని హితవు పలికారు.ఎవరి  మోచేతులు నీళ్లు మాజీ ఎమ్మెల్యే లబ్బీ వెంకట స్వామికి అవసరం లేదన్నారు. నాడు ఎమ్మెల్యే గా లబ్బి వెంకటస్వామి  పాలనలో నియోజవర్గంలో ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన పరిస్థితి ప్రజలందరికీ తెలుసునాన్నారు.జీవో 98 నిరుద్యోగులకు 1650 మందికి ఉద్యోగ నియామకాలు కల్పించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. నాటి నుంచి నేటి వరకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుపడుతుంది మీ నాయకుడు  కాదా అని ప్రశ్నించారు. స్వత్రంగా  రాజకీయంగా ఎదిగిన చరిత్ర మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిది అని అన్నారు.  నమ్మిన కార్యకర్తలకు అండగా నిలబడే నైజం ఆయనదన్నారు.  అలాంటి నాయకుడు పై  కొంత మంది చెంచాలను పక్కన పెట్టుకొని  అనుచిత వ్యాఖ్యలు చేయడం జయసూర్య కు సరికాదని మండపడ్డారు. మాజీ ఎమ్మెల్యే లబ్బి నీతికి నిజాయితీకి మారు పేరు అని అలాంటి నేతపై చిల్లర మాటలు మాట్లాడితే సహించేదే లేదంటూ వారు మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మైనార్టీ నాయకులు దౌలత్ బాషా, లాయర్లు భాస్కర్,రమేష్,   కాటేపోగు నాగసురేష్, డాక్టర్ సుధాకర్,సంజన్న,ఈశ్వరుడు.

About Author