ముగిసిన కార్మిక దినోత్సవ వారోత్సవాలు
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కార్మిక దినోత్సవ వారోత్సవాలలో భాగంగా చివరి రోజు బుధవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. గ్రామపంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరసింహులు అధ్యక్షతన జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతథిగా హాజరైన జూనియర్ సివిల్ జడ్జి టి.జోష్ణ దేవి గ్రామపంచాయతీ కార్మికులకు కార్మిక చట్టాలపై అవగాహన కల్పించారు. కార్మికులు తమ హక్కులను చట్టాల ద్వారా కాపాడుకోవాలని ఆమె సూచించారు. ప్రతి కార్మికుడు ఏ సంస్థలోనైనా ఎనిమిది గంటలు మాత్రమే పనిచేయాలని చట్టం కల్పించబడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వై.మధు బాబు, లోక్ అదాలత్ ప్యానెల్ అడ్వకేట్స్ సూరజ్ నబి, నగేష్ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.