PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

16న కార్మికుల సమ్మె  గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి

1 min read

– ఫిబ్రవరి 16వ తేదీన భారతదేశ వ్యాప్తగా సార్వత్రిక సమ్మెలో భాగంగా రైతు కార్మిక సంఘాలు గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని కోరుతూ

పల్లెవెలుగు  వెబ్ హొళగుంద : హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపాన రైస్ మిల్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా CPM మండల కార్యదర్శి వెంకటేష్ CPI మండల సహాయ కార్యదర్శి రంగన్న మాట్లాడుతూ భారతదేశంలో రైతన్నలు తమ పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని వారు అన్నారు.సమాన పనికి సమాన వేతనం కనీసం 26 వేల రూపాయలు నిర్ణయించాలి. నాలుగు లేబర్ కోర్స్ మరియు విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి. కాల పరిమితి ముగిసిన అన్ని షెడ్యూల్ పరిశ్రమలకు వెంటనే జీవోలను మంజూరు చేయాలి.2021 లో విడుదల చేసిన ఐదు కనీస వేతనాలకు గెజిట్ చేసి అమలు చేయాలి.ప్రభుత్వ రంగ సంస్థల వాటాలు అమ్మకం ప్రైవేట్ పరం చేయడం కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి ఉద్యోగ కార్మికుల పర్మినెంట్ చేయాలి.అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలి ఈ స్కీంను పట్టణాలకు పని దినాలు 200 రోజులకు పెంచి రోజువారి  కూలీ 600 ఇవ్వాలి. కేంద్ర స్కీములకు బడ్జెట్ తగ్గించవద్దు స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించి వేతనం ఇవ్వాలి. అసంఘటిత రంగ కార్మికులు సామాజిక భద్రత పథకం అన్ని రకాల ఆహార వస్తువులపై జిఎస్టి. రద్దు చేయాలి నూతన జాతీయ విద్యా విధానం 2022 చట్టాన్ని వెంటనే రద్దు అని ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. లేనియెడల రాబోయే ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి రైతులు ప్రజలు అందరూ సంసిద్ధంగా ఉన్నారని వారు తెలియజేశారు. ఈ రౌండ్ టేబుల్ కార్యక్రమం సమావేశంలో రైతు సంఘం నాయకుడు కృష్ణ సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ సిఐటియు మండల కార్యదర్శి నాగరాజ్ సిపిఐ సిపిఎం రైతు  సంఘం నాయకులు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

About Author