NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టాలీవుడ్‌ సూపర్‌‌స్టార్‌‌ పక్కన లేడీ సూపర్‌‌ స్టార్‌‌

1 min read

సినిమా డెస్క్​: టాలీవుడ్‌ సూపర్‌‌స్టార్‌‌ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మహేష్ త్రివిక్రమ్‌ మూవీకి కమిటయ్యాడన్నా సంగతీ తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా వంటి హిట్‌ సినిమాలు వచ్చాయి. తాజాగా ఈ హ్యాట్రిక్‌ మూవీకి అధికారిక ప్రకటన వచ్చింది. ఇది మహేష్ 28వ చిత్రం. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌‌పై పక్కా కమర్షియల్‌ ఎంటర్‌‌టైనర్‌‌గా రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా జరుగుతోంది. ప్రస్తుతం హీరోయిన్ల ను వెతికే పనిలో పడ్డారు త్రివిక్రమ్‌. కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లు కావాలని, ముందుగా ఒక హీరోయిన్‌ కోసం చర్చలు జరుపుతున్నామని టీమ్‌ అంటోంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సూపర్‌‌ స్టార్‌‌ పక్కన లేడీ సూపర్‌‌ స్టార్‌‌ నయనతార అయితే బాగుంటుందని, కథకి కూడా ఆమె సూటవుతుందని అనుకుంటున్నారట. ఇప్పటికే మేకర్స్‌ నయన్‌తో చర్చలు జరుపుతున్నారని టాక్.. నయన్‌ కనుక ఈ ప్రాజెక్ట్‌కి ఒకే చెబితే, మహేష్ తో కలిసి ఆమె నటించే ఫస్ట్ మూవీ ఇదే అవుతుంది.

About Author