NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ల‌క్ష జ‌రిమానా.. కోర్టుకు హీరో విజ‌య్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇంగ్లండ్ నుంచి దిగుమ‌తి చేసుకున్న ల‌గ్జరీ కారుకు త‌మిళ‌నాడులో ఎంట్రీ ప‌న్ను వ్యవ‌హారంలో ఇటీవ‌ల కోర్టు కీల‌క వ్యాఖ్యలు చేసింది. హీరో విజ‌య్ కి ల‌క్ష జ‌రిమాన విధించింది. జ‌రిమానా, కోర్టు వ్యాఖ్యల‌ను వ్యతిరేకిస్తూ హీరో విజ‌య్ అప్పీల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. జ‌రిమానా విధిస్తూ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సుబ్రహ్మణ్యం ఇచ్చిన తీర్పు న‌క‌లు లేనికార‌ణంగా హీరో విజ‌య్ అప్పీల్ పిటిష‌న్ విచార‌ణ జాబితాలో పొందుప‌ర‌చ‌లేదు. దీంతో న‌క‌లు లేకుండానే పిటిష‌న్ విచార‌ణ‌కు స్వీక‌రించాల‌ని హీరో విజ‌య్ త‌ర‌పున విజ్ఞప్తి ప్రస్తుతం దాఖ‌లైంది. దీని పై గురువారం విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌మూర్తులు .. అప్పిల్ పిటిష‌న్ ను ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ‌కు సిపార్సు చేశారు. సోమవారం విచార‌ణ జ‌ర‌గ‌నున్నట్టు స‌మాచారం.

About Author