లక్ష కోట్ల నిధులు తీసుకెళ్లారు.. !
1 min readపల్లెవెలుగువెబ్ : ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ మదుపరుల నిధుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. జూన్ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు ఉపసంహరించిన నిధులు రూ.13888 కోట్లు. ఈ ఏడాది మొత్తం మీద ఇప్పటివరకు వారు ఉపసంహరించిన నిధుల పరిమాణం రూ.1.18 లక్షల కోట్లు. రాబోయే కాలంలో కూడా ఈ నిధుల ఉపసంహరణ కొనసాగే ఆస్కారం ఉన్నదని, అయితే మధ్యకాలంలో మాత్రం అమ్మకాల జోరు తగ్గవచ్చునని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు.