సేవా ముసుగులో లక్షలాది రూపాయలు దోపిడీ..
1 min readహ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అక్రమాలను అరికట్టాలి….. సిపిఐ
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ ప్రభుత్వ ఆస్పత్రిలో హాండ్స్ అనే ఎన్జీవో స్వచ్ఛంద సంస్థ సేవా ముసుగులో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి ఫ్యాన్స్ స్వచ్ఛంద సంస్థ పై కఠిన చర్యలు తీసుకోవాలని పత్తికొండ ఆర్డిఓ కార్యాలయం అధికారికి బుధవారం సిపిఐ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్ మాట్లాడుతూ, హాండ్స్ అనే ఎన్జీవో స్వచ్ఛంద సేవా సంస్థ పత్తికొండ డివిజన్ లో ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తూ హెచ్ఐవి కి గురి కాకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అలాంటి వారికి హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వారిని గుర్తించి వాళ్ళ సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకుని దగ్గర్లో ఉన్న హాస్పెటల్ కి తీసుకువెళ్లి వారికి ఆరోగ్య సేవలు అందిస్తూ నిరంతరం వారి పట్ల పర్యవేక్షించుకుంటూ మూడు నెలలకు ఒకసారి వారికి వైద్య సేవలు అందిస్తూ వారి ఆరోగ్యం పరిరక్షించాల్సిన బాధ్యత గల హాండ్స్ ఎన్జీవో స్వచ్ఛంద సంస్థ అందుకు విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగిస్తుందని తెలిపారు. పత్తికొండ, దేవనకొండ తుగ్గలి,మద్దికేర,ఆస్పరి, చిప్పగిరి,ఈ మండలాల పరిధిలో హ్యాండ్స్ ఎన్జీవో స్వచ్ఛంద సంస్థ తమ కార్యకలాపాలను కొనసాగిస్తుందని తెలిపారు. ఇందుకుగాను హాండ్స్ స్వచ్ఛంద సంస్థకు ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయలు నిధులను కేటాయిస్తున్నదని అన్నారు. చాలా బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన ఎన్జీవో సంస్థ కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది కింది ఉద్యోగస్తులతో కుమ్మకై టెస్టులు రోగులకు టెస్టులు చేయకుండానే రికార్డులో టెస్టులు చేసినట్లు పొందపరిచి తప్పుడు రిపోర్టులు పంపిస్తున్నారని ఆరోపించారు.అదేవిధంగా జిల్లా ఆఫీసు నుండి హెచ్ఐవి కిట్స్ తెచ్చుకొని రోగులకు కిట్లు ఇచ్చినట్లు చూపించి వాటిని దుర్వినియోగం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అవసరమైన వారికి కండోమ్ లు ఇవ్వాల్సి ఉండగా వారికి ఇవ్వకుండనే కాల్చివేసి ఇచ్చినట్లు చూపిస్తున్నారని హాండ్స్ స్వచ్ఛంద సంస్థ పై మండిపడ్డారు. హెచ్ఐవి మందులను కూడా తెచ్చుకొని బాధితులకు ఇవ్వకుండా ఎవరికి కనపడనిచోట్ల పడేస్తున్నారని వాపోయారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన హాండ్స్ స్వచ్ఛంద సంస్థ అలా కాకుండా మీటింగులు జరిగినట్లు రాసుకొని దానికి సంబంధించిన డబ్బులు కాజేస్తున్నారని ఆరోపించారు.ఆ సంస్థలో పనిచేస్తున్న స్టాప్ అంతా కూడా పనిచేయకుండానే జీతాలు కాజేసి విలాసంతంగా గడుపుతూ ప్రభుత్వం నిర్ణయాన్ని నీరుగారాస్తున్నారని తెలిపారు. ప్రజలను అనారోగ్యం పాలు చేస్తూ హాండ్స్ ఎన్జీవో ప్రాజెక్టు డైరెక్టర్ మరియు దానికి సంబంధించిన స్టాప్ అన్యాయాలకు అక్రమాలకు పాలపడుతూ, ప్రభుత్వం వీరికి అప్పగించిన బాధ్యతను విస్మరిస్తూ కేటాయించిన ప్రజాధనం సంవత్సరానికి 30 నుండి 40 లక్ష రూపాయల వరకు గత మూడు సంవత్సరాలు నుండి ఇదే తంతు కొనసాగుతోందని ఆరోపించారు. ఈ సంస్థకి నంద్యాల జిల్లాలో డోన్ డివిజన్ అనంతపురం జిల్లాలో గుత్తి డివిజన్లో కూడా సంస్థ కార్యకలాపాలు ఇలాగే కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. లక్షలాది రూపాయలు డబ్బులను అవినీతి ద్వారా స్వాహా చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వాల యొక్క లక్ష్యాన్ని నిర్విరయం చేస్తున్న ఇలాంటి స్వచ్ఛంద సేవ సంస్థలపై సమగ్ర విచారణ జరిపి అక్రమాల కారణంగా దారి మల్లిన లక్షలాది రూపాయలను కవరీ చేసి సమస్థ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు గురుదాస్, ఎఐటియుసి నియోజక అధ్యక్షులు నెట్టికంటయ్య, సిపిఐ ప్రజాసంఘాల నాయకులు మాదన్న పెద్దయ్య, ఉరుకుందు, మద్దిలేటి, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.