లక్షదీపోత్సవం కార్యక్రమం.. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు , వెబ్ బనగానపల్లె: మండలం లో కార్తిక మాసం మొదటి సోమవారం సందర్భంగా యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో భక్తులు తెల్లవారుజామున నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక బనగానపల్లె శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మొదటి సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నవంబర్ నెల 7వ తేదీన కార్తీక రెండవ సోమవారం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో 1,00,000 దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందుకు స్థల ఏర్పాట్లను బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు పరిశీలించారు అనంతరం తమిళనాడులోని అరుణాచలంలో ఉన్నటువంటి అఖండ జ్యోతి ఇక్కడ యాగంటి దేవస్థానంలో ఏర్పాటు చేస్తుండడంతో ఆ పనులను కూడా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు పరిశీలించారు. నవంబర్ నెల ఏడవ తేదీన లక్ష దిపోత్సవం కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి గారు, కార్యనిర్వహణ అధికారి ధర్మారెడ్డి గారు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు పాణ్యంశాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు హాజరవుతున్నట్లు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా భక్తులకు అన్ని మౌలిక వసతిలో ఆలయ చైర్మన్ తోట బుచ్చిరెడ్డి ఆలయ కార్యనిర్వణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి లు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు ఏర్పాట్లు చేయడం జరిగింది.