లక్ష్మీప్రసాద్ చాపె సేవలు.. ప్రశంసనీయం..
1 min read–పాములపాడు మమత క్లీనిక్ రాజు
పల్లెవెలుగు వెబ్,పాములపాడు: ప్రజల వద్దకే వచ్చి ఉచిత వైద్య సేవలు అందిస్తున్న అమీలియో హాస్పిటల్ ఎండీ లక్ష్మీప్రసాద్ చాపె సేవలు ప్రశంసనీయమన్నారు పాములపాడు మమత క్లీనిక్ ఎం. రాజు. శుక్రవారం కర్నూలు జిల్లా పాములపాడులో అమీలియో ఆస్పత్రి నేతృత్వంలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. వైద్యులు యూనీస్ (జనరల్ మెడిసిన్), యశోద (గైనకాలజిస్ట్), వీరేంద్ర (ఆప్తోల్మాలజీ) రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కంటిచూపు, షుగర్, బీపీ, ఈసీజీ, తదితర పరీక్షలు చేసి అవసరం మేరకు ఉచితంగా మందులు, కరోనా నేపథ్యంలో ఉచిత మాస్కులు పంపిణీ చేశారు.
అనంతరం అమీలియో ఆస్పత్రి వైద్యులు డా. వరప్రసాద్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రతి గ్రామంలో ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పెద్దలు తమను ( సెల్ 9951923623) సంప్రదిస్తే ఉచిత వైద్యం, మందులు అందజేస్తామని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.