NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీ స్టేట్ చైర్మన్ గా.. లక్ష్మి వరప్రసాద్

1 min read

పల్లెవెలుగు, వెబ్​ విజయవాడ : యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఏపీ స్టేట్ విజిలెన్స్ అండ్ క్రైమ్ చైర్మన్ గా లక్ష్మి వరప్రసాద్ ఎన్నికయ్యారు అని ఈ మేరకు ఏపీ ప్రెసిడెంట్ షేక్ రాజీక్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతున్న “లక్ష్మి వరప్రసాద్ “…..దేశంలోనే కరప్షన్ ఫీల్డ్ లో యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నెంబర్వన్ ఆర్గనైజేషన్ గా నిలిచింది అని ,అవినీతికి వ్యతిరేకంగా అవగాహన, అవినీతి రహిత భారతదేశం, అవినీతికి వ్యతిరేకంగా కలిసి నిలబడటం ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశమని వారు పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్న అవినీతి భూతాన్ని పారద్రోలేందుకు తన వంతు కృషి చేస్తానని చైర్మన్ తెలిపారు. ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నారని తమ దృష్టికి తీసుకొని వస్తే వెంటనే తమ ఫౌండేషన్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుందన్నారు. అలాగే అధికారులు అందరూ క్రమశిక్షణగా పని చేయాలని వారు సూచించారు.తనపై నమ్మకం ఉంచి ఏపీ చైర్మన్ ఇచ్చినందుకు ఏపీ ప్రెసిడెంట్ షేక్ రాజీక్ , నేషనల్ ప్రెసిడెంట్ నరేందర్ అరోర లకు ఏపీ చైర్మన్ లక్ష్మి వరప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author