లాలూప్రసాద్ యాదవ్ కు తీవ్ర అస్వస్థత
1 min read
పల్లెవెలుగువెబ్ : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించినట్లు సమాచారం. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను.. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కు హుటాహుటిన తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆయన బాధపడుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. క్రియాటిన్ లెవల్ పడిపోవడంతో మెరుగైన ఆరోగ్యం కోసం లాలూను మంగళవారం ఎయిమ్స్‌కు తరలించాలని జైలు అధికారులకు రిఫర్ చేసినట్లు రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర ప్రసాద్ వెల్లడించారు.