NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల బ‌రిలో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగ‌బోతున్నారు. ఈ మేరకు ఆయన కీలక ప్రకటన కూడా చేశారు. జూన్‌ 15వ తేదీన నామినేషన్‌ పేపర్లు దాఖలు చేసేందుకు హస్తినకు ఫ్లైట్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నట్లు తాజాగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రకటించారు. పోటీ చేస్తున్న‌ది ఆర్జేడీ చీఫ్‌, బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌(74) కాదు. బీహార్‌ రాజకీయాల్లో, ఎన్నికల్లొచ్చిన ప్రతీసారి తీవ్ర గందరగోళానికి కారణమయ్యే వ్యక్తి ఇతను. ఇత‌ని పేరు కూడా లాలూ ప్రసాద్‌ యాదవ్‌. సరన్‌ జిల్లా మరహౌరా అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని రహీంపుర్‌ గ్రామవాసి. ఈ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను అంతా ము‍ద్దుగా ‘కర్మభూమి’ అని పిలుస్తుంటారు. గతంలోనూ ఈయన రాష్ట్రపతి ఎన్నికల బరిలో దిగే ప్రయత్నం చేశారు. 2017లో నామినేషన్‌ పేపర్లు దాఖలు చేశారు. ఆ టైంలో బీహార్‌ గవర్నర్‌గా ఉన్న రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ లోక్‌సభ స్పీకర్‌ మీరా కుమార్‌ మధ్య ప్రధాన పోటీ నడిచింది. అయితే ఆ టైంలో లాలూ పేరుని ప్రతిపాదించేంత మంది లేకపోవడంతో అది తిరస్కరణకు గురైంది.

                           

About Author