మెట్ల పై నుంచి జారిపడ్డ లాలూప్రసాద్ యాదవ్ !
1 min readపల్లెవెలుగువెబ్ : బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ మెట్లపై నుంచి జారిపడ్డారు. దీంతో ఆయన భుజానికి ఫ్రాక్చర్ అయింది. వెన్నెముకకూ స్వల్ప గాయాలయ్యాయి. తన సతీమణి, మాజీ సీఎం రబ్రీదేవి అధికారిక నివాసంలో ఈ ఘటన జరిగింది. ఇప్పటికే కిడ్నీ సమస్యలకు చికిత్స తీసుకుంటున్న 75 ఏళ్ల లాలూను ఆస్పత్రికి తీసుకెళ్లి కట్టు కట్టించామని కుటుంబ సభ్యులు తెలిపారు.