లాంబ్డా .. కరోనలో కొత్త వేరియంట్ కలకలం !
1 min readపల్లెవెలుగు వెబ్ : కరోనలో కొత్త రకం వేరియంట్.. లాంబ్డా. ఈ వైరస్ చాలా దేశాల్లో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా డబ్ల్యూహెచ్వో ప్రకటించింది. అంటే ఈ వైరస్ ‘దృష్టిసారించాల్సిన వైరస్ ’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. బ్రిటన్ లోని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ దీనిని పరిశోధనలో ఉన్న కరోన రకంగా గుర్తించింది. ఈ వైరస్ స్పైకోప్రోటీన్లలో పలు రకాల ఉత్పరివర్తనలు ఉన్న నేపథ్యంలో దీనిని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా 29 దేశాలకు ఈ లాంబ్డా వైరస్ విస్తరించింది. పెరు దేశంలో ఏప్రిల్ నుంచి బయటపడ్డ కరోన కేసుల్లో 81 శాతం లాంబ్డా వైరస్ కేసులు ఉండటం గమనార్హం. ఈ వేరియంట్ వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తుందనడానికి గానీ, వ్యాక్సిన్ల నుంచి తప్పించుకోగలదనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పీహెచ్ఈ తెలిపింది.