‘భూ హక్కు- భూరక్ష’ ను పటిష్టంగా అమలు చేయాలి
1 min readఅధికారులను ఆదేశించిన ఏలూరు ఆర్డీవో కె.పెంచల్ కిషోర్
పల్లె వెలుగు, ఏలూరు : జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష రీ సర్వే కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని ఏలూరు రెవిన్యూ డివిజినల్ అధికారి కె. పెంచెల్ కిషోర్ అధికారులను ఆదేశించారు. జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష రీ సర్వే కార్యక్రమం అమలుపై ఏలూరు డివిజన్లలోని తహసీల్దార్లు, రెవిన్యూ, సర్వే శాఖల సిబ్బందితో ఏలూరు కలెక్టరేటులోని గోదావరి సమావేశపు హాలులో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ పెంచేల్ కిషోర్ మాట్లాడుతూ శతాబ్దం కాలం క్రితం చేసిన భూ సర్వే పనులను ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ ద్వారా రీ సర్వే ను చేపడుతున్నామన్నారు. ఈ విధానం ద్వారా కచ్చితమైన సమాచారం ఉంటుందని, భూ తగాదాలకు తావులేని విధంగా సర్వే ఉంటుందన్నారు. గ్రౌండ్ ట్రూతింగ్ విధానంలో ప్రభుత్వ, ప్రైవేట్ భూములు, గ్రామాల సరిహద్దులను ఖచ్చితంగా నిర్దారించవచ్చన్నారు. రీ సర్వే పై రెవిన్యూ , సర్వే శాఖల సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ అందించడం జరిగిందన్నారు. రీ సర్వే పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ అధికారులను ఆదేశించారు. సమావేశంలో సర్వే శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లక్ష్మణరావు, డి ఐ ఓ ఎస్ రమణారావు, ఆర్డీఓ కార్యాలయం ఏ ఓ దేవకీదేవి, ఏలూరు డివిజన్ కు సంబందించిన తహసీల్దార్లు, రెవిన్యూ, సర్వే శాఖల సిబ్బంది పాల్గొన్నారు.