PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ల్యాండ్ టైటిల్ యాక్ట్ 27 ను రద్దు చేయాలి

1 min read

-పత్తికొండ లో న్యాయవాదుల నిరసన             

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని పత్తికొండ బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఆధ్వర్యంలో సోమవారం నాలుగు స్తంభాల దగ్గర రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రసంగిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో నూతనంగా ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల చిన్న సన్న కారు రైతులు చాలా ఇబ్బందులకు గురవుతారని అన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని,అలాగే రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే విరమించుకొని టైటిలింగ్ యాక్ట్ కేసులను స్థానిక సివిల్ జడ్జి కోర్టులకు వచ్చే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో భార్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణయ్య సీనియర్ న్యాయవాదులు,  బార్ అసోసియేషన్ అధ్యక్షుడు  కృష్ణయ్య మరియు సీనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి, సురేష్ కుమార్, సత్యనారాయణ మైరాముడు,  చంద్రశేఖర్ నాయుడు, లక్ష్మన్న,  పంపాపతి రమేష్, మల్లికార్జున, రంగస్వామి, మహేష్, రవి కుమారు, కాశీ విశ్వనాథ, దామోదరచారి, రవి నాగరాజు, హరి తదితరులు పాల్గొన్నారు.

About Author