PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హీరోల మ‌ధ్య భాషా యుద్ధం.. హిందీ ట్వీట్ కు క‌న్న‌డ‌లో రిప్లై ఇస్తే.. !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ‘కెజియఫ్-2’ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ హిందీ ఎంత మాత్రం జాతీయ భాష కాదన్నాడు. సుదీప్ మాటలకు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ దీటుగా బదులిచ్చాడు. ‘‘నా సోదరుడా.. కిచ్చా సుదీప్.. హిందీ జాతీయ భాష కాదని నువ్వు అంటున్నావు. మరి సినిమాను నీ ప్రాంతీయ భాషలో విడుదల చేయకుండా ఎందుకు హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నావు? ఇప్పుడు, ఎల్లప్పుడు హిందీ మాతృ భాష, జాతీయ భాష’’ అని అజయ్ దేవగణ్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ట్వీట్‌కు సుదీప్ రిప్లై ఇచ్చాడు. ‘‘నేను వేరే సందర్భంలో ఈ మాటలను చెప్పాను. మీరు తప్పుగా నన్ను అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలసినప్పుడు ఆ మాటలను ఎందుకు అన్నానో నేను చెబుతాను. ఎవరినీ బాధపెట్టాలని, రెచ్చగొట్టాలని ఆ వ్యాఖ్యలు చేయలేదు. దేశంలోని ప్రతి భాష మీద నాకు గౌరవం ఉంది. ఈ టాపిక్ ఇక్కడితే ముగిసిపోతే బాగుంటుంది. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను.మీరు హిందీలో చేసిన ట్వీట్ నాకు అర్థమైంది. నాకు హిందీ మీద ప్రేమ, గౌరవం ఉంది కాబట్టే నేర్చుకున్నాను. కానీ, కన్నడలో నేను రిప్లై ఇస్తే పరిస్థితి ఏంటీ అని ఆలోచిస్తున్నాను’’ అని కిచ్చా సుదీప్ ట్విట్టర్‌లో మెసేజ్ షేర్ చేశాడు.

                                      

About Author