సంక్షోభంలో లంక.. దేశ అధ్యక్షుడి ఇంటి ముందు నిరసనలు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారడంతో శ్రీలంకలో కర్ఫ్యూ విధించారు. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే నివాసం ఎదుట జరిగిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో జర్నలిస్టులతో సహా 10 మంది గాయపడ్డారు. గోటబయ నివాసానికి వెళ్లే రహదారిపై బస్సును దహనం చేయడానికి ముందు నిరసనకారులు గోడను కూల్చివేసి, పోలీసులపై ఇటుకలను విసిరారు. లంక ప్రభుత్వం వద్ద ఇంధన దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్యం లేక తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీలంక ఆర్మీకి చెందిన బస్సు, జీపులకు నిరసనకారులు నిప్పు పెట్టారు.