9 నుంచి 12 తరగతి విద్యార్థులకు లాప్ టాప్ లు !
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 9 నుంచి 12 తరగతి విద్యార్థులకు లాప్ టాప్ లు పంపిణీ చేయాలని ఏపీ కేబినెట్ తీర్మానించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ వెటర్నరీ అంబులెన్స్ లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జేఎన్టీయూ చట్టం-2008 సవరణకు నిర్ణయం తీసుకుంది. టిడ్కో ద్వార 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తీ చేసేందుకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. 2021-24 ఐటీ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.