ఈ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు !
1 min readపల్లెవెలుగువెబ్ : రానున్న నాలుగేళ్లలో ఇంజనీరింగ్, టెలికాం, హెల్త్‌కేర్ రంగాల్లో పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మూడు రంగాల్లో 2026 నాటికి సుమారు 1.2 కోట్ల ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని టీమ్‌లీజ్ డిజిటల్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ఈ మూడు రంగాల్లో 4.2 కోట్ల మంది పని చేస్తున్నారు. ఈ మూడు రంగాలకు చెందిన దాదాపు 750 కంపెనీల ప్రముఖులతో మాట్లాడి టీమ్‌లీజ్ ఈ నివేదిక విడుదల చేసింది. డిజిటైజేషన్‌తో పాటు సరికొత్త సాంకేతిక మార్పులు, ఆర్థిక వ్యవస్థ గాడినపడడం ఇందుకు ప్రధాన కారణమని ఈ నివేదిక పేర్కొంది. వచ్చే నాలుగేళ్లలో ఈ మూడు రంగాల్లో ఏర్పడే మొత్తం ఉద్యోగాల్లో 17 శాతం ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన వృత్తి నిపుణులకు చెందినవని తెలిపింది.