NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అతిపెద్ద ఐపీవో ఎల్ఐసీ.. త్వ‌ర‌లో పబ్లిక్ ఇష్యూకి ..

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఎల్ఐసీ ఐపీవోగా పబ్లిక్ ఇష్యూకి రాబోతోంది. దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా ఎల్ఐసిని భావిస్తున్నారు. ఇష్యూకు సంబంధించిన ముసాయిదా పత్రాలను ఇప్ప‌టికే సెబీకి స‌మ‌ర్పించింది. ‘ఎల్‌ఐసీ ఐపీవో కోసం అవసరమైన ముసాయిదా పత్రాలను సెబీకి అందించాం. ఈ ఐపీవో ద్వారా ఎల్‌ఐసీ ఈక్విటీలో 5 శాతానికి సమానమైన ఒక్కోటి రూ.10 ముఖ విలువ (ఫేస్‌ వ్యాల్యూ) ఉండే 31.6 కోట్ల షేర్లను విక్రయిస్తాం’ అని ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) కార్యదర్శి తుహిన్‌కాంత పాండే చెప్పారు. కంపెనీ భవిష్యత్‌ లాభాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత ఎంబడెడ్‌ విలువ రూ.5.4 లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వం ఆ పత్రాల్లో పేర్కొంది.పబ్లిక్‌ ఇష్యూ ద్వారా ఎల్‌ఐసీ జారీ చేసే 31.6 కోట్ల షేర్లలో పది శాతం పాలసీదారులకు రిజర్వు చేశారు. వీరితోపాటు ఎల్‌ఐసీ ఉద్యోగులకూ ఐదు శాతం షేర్లు రిజర్వు చేస్తారు. ఇంకా యాంకర్‌ ఇన్వెస్టర్లు, క్వాలిఫైడ్‌ ఇన్వెస్టర్లు, రిటైల్‌ ఇన్వెస్టర్లకూ ప్రత్యేక కోటా ఉంటుంది.

                                 

About Author