NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశవ్యాప్తంగా అతిపెద్ద ఒకరోజు పశువుల సంరక్షణ శిబిరాలు

1 min read

అతిపెద్ద పశువుల సంక్షేమ పాఠం కోసం గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పిన SMFG ఇండియా క్రెడిట్

పల్లెవెలుగు ,కడప : భారతదేశంలోని 6 వేదికలలో 517 మంది అభ్యర్థులు పాల్గొనగా  “అతిపెద్ద పశువుల సంక్షేమ పాఠం (బహుళ వేదికలు)” కోసం SMFG ఇండియా క్రెడిట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. కంపెనీ 7వ ఎడిషన్ పశు వికాస్ డే (PVD)లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన అతిపెద్ద ఒకరోజు పశువుల సంరక్షణ శిబిరాలు ద్వారా ఈ మైలురాయిని సాధించారు. ఈ శిబిరాలు 16 రాష్ట్రాలలోని 500 ప్రదేశాలలో ఏకకాలంలో నిర్వహించబడ్డాయి, దీనిద్వారా దాదాపు 1,90,000 మంది లబ్ధిదారులు (1,50,000 పశువులు మరియు 40,000 పశువుల యజమానులు) ప్రయోజనం పొందారు.భారతదేశంలో, గ్రామీణ ప్రాంత జనాభాలో దాదాపు 65-70% మంది తమ జీవనోపాధి కోసం వ్యవసాయం లేదా వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలపై ఆధారపడుతున్నారు. అందువల్ల, వారి జీవనోపాధి ఉత్పత్తి కార్యకలాపాలు మరియు ఆర్థిక శ్రేయస్సులో పశువులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విడదీయరాని బంధాన్ని గుర్తించి, SMFG ఇండియా క్రెడిట్ 7వ ఎడిషన్ పశు వికాస్ దినోత్సవాన్ని “మేరా పశు మేరా పరివార్” అనే నేపథ్యంతో జరుపుకుంది, ఇది ఈ గ్రామీణ కుటుంబాల జీవితాల్లో పశువుల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. వార్షిక PVD కార్యక్రమంలో 6,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు చురుకుగా పాల్గొన్నారు, ఇది గ్రామీణ సంక్షేమం పట్ల కంపెనీ నిబద్ధతను వెల్లడించింది. SMFG ఇండియా క్రెడిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శంతను మిత్రా మాట్లాడుతూ, “SMFG ఇండియా క్రెడిట్‌ వద్ద, అర్థవంతమైన ప్రభావాన్ని సృష్టించే సామాజిక కార్యక్రమాలను ప్రోత్సహించడం పట్ల మేము స్థిరంగా మా నిబద్ధత వెల్లడిస్తున్నాము. భారతదేశ వ్యాప్తంగా  1000+ శాఖల నిర్వహణతో, మా ప్రాథమిక దృష్టి టైర్-2+ ప్రాంతాలపై నిలిచింది, మా శాఖలలో దాదాపు 90% ఈ ప్రాంతాలలో వ్యూహాత్మకంగా ఏర్పాటు చేయబడ్డాయి. వాస్తవానికి, గత రెండు సంవత్సరాలలో, మేము దాదాపు 300 శాఖలను జోడించాము, అన్నీ టైర్-2+ భౌగోళిక ప్రాంతాలలో ఉన్నాయి. సరైన ఉత్పత్తులు మరియు ఆర్థిక పరిష్కారాలను అందించడం ద్వారా ఆర్థిక చేరికను ప్రోత్సహించడం మా లక్ష్యం, అది కమ్యూనిటీలకు వారి  జీవిత చక్రంలోని ప్రతి దశలో వారికి సేవ చేయడానికి మాకు వీలు కల్పిస్తుంది. అంకితభావంతో బహుళ వేదికలలో అతిపెద్ద పశువుల సంక్షేమ పాఠం కోసం గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించడంలో తమ  అత్యుత్తమ నిబద్ధత మరియు కృషిని ప్రదర్శించిన  మా ప్రతి ఉద్యోగికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం పశు వికాస్ దినోత్సవం పశువుల సంరక్షణలో అంచనాలను అధిగమించడమే కాకుండా, భారతదేశంలోని బహుళ వేదికలలో ప్రత్యేక విజ్ఞాన సెషన్‌లను పరిచయం చేయటం నిజంగా సంతోషముగా  ఉంది, ఇది మాకు గిన్నిస్ ప్రపంచ రికార్డును సంపాదించిపెట్టింది.” అని అన్నారు. SMFG ఇండియా క్రెడిట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ స్వామినాథన్ సుబ్రమణియన్ మాట్లాడుతూ “బహుళ వేదికలలో అతిపెద్ద పశువుల సంక్షేమ పాఠాన్ని నిర్వహించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నుండి అందుకున్న గుర్తింపు SMFG ఇండియా క్రెడిట్‌లోని ప్రతి ఒక్కరికీ గర్వించదగ్గ మరియు నిర్వచించదగిన క్షణం. ఒక కంపెనీగా, మేము అంతర్జాతీయ స్థాయిలో చరిత్ర పుస్తకాలలో మా పేరును లిఖించుకున్నాము. వినూత్నమైన , స్థిరమైన సామాజిక-ఆర్థిక కార్యక్రమాల ద్వారా మేము విస్తృతంగా సేవలందిస్తున్న సమాజాలను ఉద్ధరించడానికి కృషి చేయడం కొనసాగించాలనే విశ్వాసాన్ని ఇది ఇస్తుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రపంచ రికార్డును నెలకొల్పడం గ్రామీణ సంక్షేమం పట్ల మా అంకితభావాన్ని పునరుద్ఘాటిస్తుంది మరియు వారి జీవితంలోని పలు దశలలో  మా ఆర్థిక పరిష్కారాల ద్వారా ఆర్థిక అవకాశాలను అందించడం ద్వారా సమాజాలను శక్తివంతం చేయటం  కొనసాగించడానికి మమ్మల్ని ప్రేరేపిస్తుంది” అని అన్నారు. ప్రపంచ రికార్డులను సాధించడంలో దాని గొప్ప వారసత్వంపై ఆధారపడి, ఒకే రోజులో అతిపెద్ద పశువుల సంరక్షణ శిబిరాలను నిర్వహించినందుకు, గతంలో  పశు వికాస్ దినోత్సవాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, బెస్ట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ మరియు వరల్డ్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించాయి.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *