లతా మంగేష్కర్ ఆస్తులు.. ఎవరికి దక్కుతాయంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఇటీవల తుదిశ్వాస విడిచారు. గాయనిగా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. పెళ్లి కూడా చేసుకోని లతా మంగేష్కర్ ఆస్తుల చిట్టా చాలా పెద్దది. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 200 కోట్లపైనే. సాధారణంగా మరణాంతరం వారి ఆస్తులు పిల్లలకు లేదా భర్తకు చెందుతాయి. కానీ చివరి వరకు బ్రహ్మచారినిగా ఉన్న లతాజీ ఆస్తులు ఇప్పుడు ఎవరికి చెందుతాయనేది ప్రశ్నగా మారింది. చెల్లెల్లు ఆశా భోంస్లే, మీన ఖడికర్, ఉషా మంగేష్కర్ సోదరుడు హృదయనాథ్ మంగేష్కర్లకు దగ్గుతాయని అంటున్నారు. అలాగే తన తండ్రి పేరుపై కట్టించిన ట్రస్ట్‌కు కూడా లతా ఆస్తులు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె చెల్లెల్లు, సోదరుడు గాయకులుగా మంచి పోజిషన్లో ఉన్నారు. ఆస్తులు కూడా బాగానే సంపాదించుకున్నారు. వారంత ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. దీంతో లతా ఆస్తులు ట్రస్ట్‌కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు