PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లతా అంత్యక్రియలు.. వివాదంలో షారుఖ్ !

1 min read

పల్లెవెలుగువెబ్ : ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు సందర్భంగా బాలీవుడ్ నటుడు షారుఖ్ వివాదంలోకి చిక్కుకున్నారు. లతా అంత్యక్రియల్లో పాల్గొన షారూఖ్‌ భౌతికకాయం చుట్టూ తిరిగి చేతులు జోడించి నమస్కారం చేశారు. ఇస్తాం మత పద్దతిలో ప్రార్థించిన తర్వాత నోటి నుంచి గాలి ఊదారు. ఆయన అలా ఊదడాన్ని ఉమ్ముతున్నట్టుగా క్రియేట్‌ చేసి షారుక్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో చాలామంది నెటిజన్‌లు, సెలబ్రిటీలు షారుక్‌కు మద్దతుగా నిలిచారు. ‘‘ఎవరైన చనిపోయినప్పుడు ప్రార్థనలు చేసి గాలి ఊదడం ముస్లింలలో సాధారణంగా జరుగుతుంది. చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని దువా చదివి గాలి ఊదుతారు. దాని అర్థం తెలియని అరుణ్‌ యాదవ్‌ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెలియని విషయాన్ని అడిగి తెలుసుకోవాలి’’ అని నెటిజన్లు మండిపడుతున్నారు.

       

About Author