స్వర్గీయ శ్రీ V.S.S. సత్యనారాయణ గుప్తా జ్ఞాపకార్థం అన్నదానం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు అయిన కర్నూలుకి చెందిన సి.శ్రీనివాసులు, అనంతపురం కు చెందిన ఎం శివప్రసాద్, హైదరాబాదుకు చెందిన భాను ప్రసాద్ ఉదయ్ శంకర్ టి. ఎస్. రావు, చిత్తూరుకు చెందిన టపాసుల సత్యనారాయణ వారి సహకారంతో.. కర్నూలు నగరములో అశోక్ నగర్ పంపు, హౌస్ ఎదురుగా రాయలసీమ మహిళా సంఘ్ ఆధ్వర్యంలో నడపబడుతున్న నిరాశ్రయుల వసతి గృహంలో 30 మంది నిరాశ్రయులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ..తమ మిత్రుడు సత్యనారాయణ గుప్తా గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరమన్నారు. ఈరోజు మా మధ్య లేడు అనే మాటను జీర్ణించుకోలేకపోతున్నాం. మా ఫ్రెండ్స్ అంతా కలిసి అనేక సేవా కార్యక్రమాలు చేశామన్నారు. ఈరోజు మా మిత్రుడి కార్యక్రమాన్ని మా చేతుల మీద నిర్వహించడం దురదృష్టకరమన్నారు. మనిషి ఎంత సంపాదించాడు అనేది కాదు ఎలా జీవించాడు అనేది ముఖ్యమన్నారు. మా మధ్యలో తిరిగే మనిషి ఈరోజు మాతో లేడు,మనం పోయాక ఏ బంధాలు మనతో రావు, మా మిత్రుడితో మాకు ఉన్న అనుబంధం అలాంటిది అన్నారు. అందుకే ఈరోజు ఫ్రెండ్స్ పర్ ఎవర్ ఫౌండేషన్ తరపున ఈరోజు మా మిత్రుడికి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమంలో భాగంగా నిరాశ్రయ వసతి గృహంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము అన్నారు. వసతి గృహ నిర్వాహకురాలు రాయలసీమ శకుంతల మాట్లాడుతూ… మన ఇంటిలో వాళ్ళు పోయినా పట్టించుకోని ఎన్నోసందర్భాల్లో మనం చాలా చూశాము. మిత్రుడు కోసం అందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇలాంటి నిరాశ్రయులకు కడుపు నింపడం చాలా సంతోషమన్నారు. వసతి గృహం తరపున వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఫౌండేషన్ సభ్యులు, సెంట్రల్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. రమణ, నిరాశ్రయులు పాల్గొన్నారు.