“పుష్ప న్యూరో క్లినిక్” ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ విజయవాడ: స్థానిక సూర్యారావుపేటలో పుష్ప న్యూరో క్లినిక్ సోమవారం ముఖ్యఅతిథిలుగా డాక్టర్ కె. బాబ్జి న్యూరో సర్జన్ వైఎస్ఆర్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ , డాక్టర్ పి.వి. రమణమూర్తి మేనేజింగ్ డైరెక్టర్ ఆంధ్ర హాస్పిటల్, ఎస్. వెంకటేశ్వర రావు డిఎస్పి. విజిలెన్స్, విచ్చేసి వారు చేతుల మీదుగాప్రారంభోత్సవం జరిగింది .ఈ సందర్భంగా “పుష్ప న్యూరో క్లినిక్ “వ్యవస్థాపకులు సీనియర్ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ నూతక్కి పుష్పరాజ్ మాట్లాడుతూ మెదడు, వెన్నుపాము, నరముల సంబంధించి సమస్యలు అత్యాధునిక పద్ధతిలోసాంకేతిక ప్రమాణాలతో పరీక్షలు జరిపివైద్య సేవలు అందరికీ అందుబాటులో చికిత్స చేస్తామని అన్నారు . గత15 సంవత్సరములు గా అనుభవం ఉందని మెదడు జ్వరం , మెదడు వాపువ్యాధి ,జ్వరము తలనొప్పి , వాంతులుతల తిరగడం, కళ్ళు తిరగడం, నడకలో బ్యాలెన్స్ తప్పడం, మూతి వంకర పోవడం, వాంతులు,తలనొప్పి ,ఫిట్స్, రావడం దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య సేవలు అందించగలరని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో లేవలేని పేషెంట్లు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటే ఇంటి వద్దకు కూడా వచ్చి వైద్య సేవలు అందించగలమని అన్నారు. విజయవాడ ,పరిసర ప్రాంత ప్రజలకు ,వైద్య సేవలు అందించడం మా చిరకాల వాంఛ అనిఈ క్లినిక్ ద్వారా అది తీరిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.