మొబైల్ అంబులెన్స్ క్లినిక్స్ ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: మండలంలో:పశుసంవర్ధక సేవలు గడప వద్దకే చేరాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పశుసంవర్ధక శాఖ అందించడం జరుగుతుంది.అందులో భాగంగా మొబైల్ ఆంబులెన్స్ క్లినిక్స్ సేవలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది.అందులో భాగంగా డాక్టర్ వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవ పథకం ద్వారా 1962 నెంబర్ కు ఫోన్ చేస్తే ఇంటి వద్దకే వాహనం ద్వారా వచ్చి పశువైద్య శిబిరం ఏర్పాటు చేసి డాక్టర్లు వైద్యం అందించడం జరుగుతుంది.బనగానపల్లె నియోజకవర్గానికి మొదట మొబైల్ అంబులెన్స్ క్లినిక్ వాహనం బనగానపల్లె శాఖకు అందుబాటులోకి రావడం జరిగింది. వాహనాన్ని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి రైతులకు సేవలు అందించడం జరుగుతుంది.ఇప్పుడు బనగానపల్లె నియోజకవర్గం సంజామల పరిధిలోని ఏరియా పశువైద్య శాల నూతన వాహనం అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ మేరకు ఈనెల 26వ తేదీన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని సంజామల మండల పశుసంవర్ధక శాఖ ఏడి మోహన్ రావు చెప్పారు.ఈ మేరకు బనగానపల్లె మండలం పశుసంవర్ధక శాఖ ఏడి మారుతి సకారామ్,సంజామల మండల పశుసంవర్ధక శాఖ ఏడి మోహన్ రావు లో కలిసి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మొబైల్ క్లినిక్స్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ శివానంద్ ,డాక్టర్ రఘు బాలకృష్ణ,డాక్టర్ రమేష్, డాక్టర్ రామ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎం బ్రహ్మానందరెడ్డి, బైరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ భారతి దేవి, టంగుటూరు డాక్టర్ చిన్నబాబు, డాక్టర్ ఐశ్వర్య తదితరులు ఉన్నారు.