న్యూ డయాగ్నస్టిక్ బయో కెమిస్ట్రీ ల్యాబ్ సేవలు ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, మాట్లాడుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ లో బయో కెమిస్ట్రీ 24ల్యాబ్ సేవల ను ప్రారంభించినట్లు తెలిపారు.క్లినికల్ బయో కెమిస్ర్టీ ల్యాబ్‌లో నూతన టెస్టింగ్ పరికరాలను ప్రారంభించినట్లు తెలిపారు. రోగులు పెరుగుతున్న నేపథ్యంలో వారికి అత్యున్నత ప్రమాణాలతో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.రోగుల సంరక్షణ, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఓపీడీ మరియు ఐపి విభాగంలో ఆటోమెటెడ్ పరికరాలతో పని చేయగలిగిన బయో కెమిస్ర్టీ టెస్టింగ్ ప్యానల్, సెమీ ఆటో అనలైజర్ యంత్రాలను నెలకోల్పినట్లు తెలిపారు. ఆసుపత్రిలో బయో కెమిస్ట్రీ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలియజేశారు.ఆసుపత్రి సిబ్బంది పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలియజేశారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్, డా.సుధాకర్ ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి, CSRMO డా.వెంకటేశ్వరరావు, బయోకెమిస్ట్రీ హెచ్వోడీ, డా.పద్మ విజయ శ్రీ, RMO, డా.వెంకటరమణ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివబాల నగాంజన్, డా.కిరణ్ కుమార్, డా.సునిల్ ప్రశాంత్, మరియు బయో కెమిస్ట్రీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, తెలిపారు.