NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శిరిడి సాయి హోమ్ ఫుడ్స్” ప్రారంభం

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ : స్థానిక బిఆర్ టిఎస్ రోడ్డు లో బావాజీపేట, సెకండ్ లైన్ , రంగ మహల్ రోడ్డులో షిరిడి సాయి హోమ్ ఫుడ్స్ ప్రారంభం. ముఖ్యఅతిథిగాసెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, పాల్గొన్నారు. 36 డివిజన్ కార్పొరేటర్, బాలి గోవిందు 25వ డివిజన్ కార్పొరేటర్ బంకాశకుంతల బంక భాస్కరరావు, పాల్గొన్నారు షిరిడి సాయి హోమ్ ఫుడ్స్ అధినేత కిషోర్ నాగేంద్ర కుమార్ మాట్లాడుతూ మాకు ఫుడ్ ఐటమ్స్ తయారు చేయడంలో ఎంతో అనుభవం ఉందని, 1985లో మేము ఫుడ్ ఐటమ్స్ మార్కెట్లో ప్రారంభించామని. ఎంతో రుచికరమైన పదార్థాలు తయారుచేసి పట్టణవాసులకు అందించాలని ఉద్దేశంతో విజయవాడలో మాకు ఈ బ్రాంచ్ కాకుండా రెండు బ్రాంచ్ లు ఉన్నాయని అన్నారు. కాంబో స్పెషల్, రింగ్ రోస్ట్ మా ప్రత్యేకతని ,ఇడ్లీ సాంబార్, ,పలు రకాల దోసెలు రాగి దోశ పేపర్ దోశ వెరైటీలు చేస్తామని , రుచికరమైన ఆహార పదార్ధములు అందించడంలో శిరిడి సాయి హోమ్ ఫుడ్స్ ప్రత్యేకత ఉందని ,ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు మా హోమ్ ఫుడ్స్ ఐటమ్స్ రుచి లు చూడగలరని అన్నారు. ఆర్డర్లపై సప్లైయ్ చేయబడునని, త్వరలోనే భోజన హోటల్ ప్రారంభిస్తామని ఈ సందర్భంగా అన్నారు కార్యక్రమంలో శిరిడి సాయి హోమ్ ఫుడ్స్ కుటుంబ సభ్యులు, నాగలక్ష్మి నరసింహ స్వామి, శివ .,తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author