NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాలసాయి ట్రస్ట్​ నేతృత్వంలో.. ‘పల్లెవెలుగు’ క్యాలెండర్​ ఆవిష్కరణ

1 min read

కర్నూలు: భగవాన్​ శ్రీ బాలసాయిబాబా 62వ జన్మదినోత్సవం, ప్రపంచశాంతి సదస్సును భగవాన్​ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్​ ట్రస్ట్​ చైర్మన్​ టి. రామారావు నేతృత్వంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టి. రామారావు మాట్లాడుతూ బాలసాయిబాబా ట్రస్ట్​ ఆధ్వర్యంలో జరిగే పలు సేవా కార్యక్రమాలను వివరించారు.  కార్యక్రమం అనంతరం..  పల్లెవెలుగు దినపత్రిక 2023 క్యాలెండర్​ను నగర మేయర్​ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్​ రెడ్డి సతీమణి శ్రీమతి విజయ మనోహరి, భగవాన్​ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్​ ట్రస్ట్​ చైర్మన్​ టి. రామారావు, రాష్ట్ర వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్.గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, విశ్వహిందూ పరిషత్ సౌత్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు ఎన్.సాయిరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోరంట్ల రమణ, కె.వి. సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కె.వి. సుబ్బారెడ్డి, ట్రస్ట్ ప్రతినిధులు కె.ఉషాశ్రీ, డా.సుబ్రమణ్యశ్వర రెడ్డి, శ్రీ బాలసాయి హాస్పిటల్ డాక్టర్ జయప్రకాష్, విదేశాల నుంచి వచ్చిన బాలసాయి శిష్యులు ఎలియానా ఫీ, లిల్లీ జెన్సన్, డా. హినజ్ లిస్బోక్ పాల్గొన్నారు.

About Author