ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించిన కర్నూల్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఫిబ్రవరి 17వ తేదీన కర్నూల్ రూరల్ ల్లో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామచంద్ర రావు ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ అర్థిక అక్షరాస్యత పెంపొందించుకోవాలని, ఆర్థిక వ్యవహారాలు రిజర్వ్ బ్యాంక్ గుర్తించిన ఆర్థిక సంస్థల ద్వారా చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంస్థలలో ఆర్థిక మోసాలు జరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అంబేడ్కస్మన్ ద్వారా పరిష్కారం పొందవచ్చు అన్నారురిజర్వ్ బ్యాంక్ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ మరియు కెనరా బ్యాంక్ వారి సౌజన్యంతో, సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను వివిధ మండలాల్లో స్థాపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి ఆంజనేయులు మాట్లాడుతూ ఈ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం సేవలను ఉపయోగించుకొని అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక అక్షరాస్యత కేంద్ర ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి ఆంజనేయులు మరియు ప్రాజెక్ట్ మేనేజర్ వి అశోక్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు.