PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళల రక్షణకు చట్టాలు అండగా ఉన్నాయి

1 min read

– మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
– న్యాయమూర్తి తిరుమలరావు
– శ్రీసాయిరాం డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మహిళల రక్షణకు అనేక చట్టాలు అండగా నిలుస్తున్నాయని వాటిని ఉపయోగించుకుని మహిళలు సమస్యలను పరిష్కరించుకోవాలని నందికొట్కూరు జూనియర్ సీవిల్ జడ్జి తిరుమల రావు సూచించారు. నందికొట్కూరు పట్టణంలోని శ్రీ సాయిరాం డిగ్రీ కళాశాల ఆవరణలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి తిరుమల రావు ముఖ్య అథిదిగా హాజరయ్యారు. విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సెల్ ఫోన్ వంటి ఆధునిక సాధనాలను ద్వారా మహిళలు రక్షణ పొందే విధంగా పలు చట్టాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకొని రక్షణ పొందాలన్నారు. అయితే సోషల్ మీడియా, ఇంటర్నెట్ వంటి వాటి విషయాలలో అమ్మాయిలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మహిళలకు విద్యతో సంపూర్ణ హక్కులు పొందగలుగుతారని, అందువలన ప్రతి ఒక్కరు ఉన్నత విద్య కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు సమస్యలను సెల్ ఫోన్స్, పోస్ట్ కార్డు ద్వారా తెలియజేసి రక్షణ పొందవచ్చునని,దీనికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు.ముఖ్యంగా బాల్య వివాహాలు జరుగుతున్నప్పుడు ఎవరైనా సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అందువల్ల విద్యార్థులు అలాంటి సంఘటనలు మీదృష్టికి వస్తే తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీ సాయిరాం విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ రెడ్డి, కరస్పాండెంట్ పద్మావతి, ప్రిన్సిపాల్ వెంకటేష్, న్యాయవాదులు వెంకటరాముడు, స్వామి రెడ్డి, కొంగర వెంకటేశ్వర్లు, వెంకటరమణ, జనార్దన్, మద్దయ్య, కేశాలు, పార లీగల్ వాలంటరీలు శోభారాణి, కళాశాల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.

About Author