PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రైతులకు శాపంగా మారుతున్న చట్టాలను రద్దు చేయాలి

1 min read

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం(AIKS). భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) ఆధ్వర్యంలో హోళగుంద మండల విద్యుత్ శాఖ AE ఓబులమ్మకు వినతి పత్రం

రైతుల బోరు బావులకు స్మార్ట్ మీటర్లు బిగించి జీవో నెంబర్ 21 తక్షణమే రద్దు చేయాలి….CPI…AIKS

CPI మండల కార్యదర్శి పెద్దహ్యట మారెప్ప

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఈ సందర్భంగా CPI మండల కార్యదర్శి పెద్దహ్యట మారెప్ప AIKS రైతు సంఘం నాయకుడు కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు బదిలి పథకం రైతులకు శాపంగా మారుతున్న స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలని రైతన్నలకు శాపంగా మారుతున్న జీవో నెంబర్ 21 తక్షణమే రద్దు చేయాలని హోళగుంద మండలం రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతుల బోరు బావులు దగ్గర స్మార్ట్ మీటర్లు అధికారులు బిగించడం జరుగుతుంది.కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైతులకు శాపంగా మారుతున్న చట్టాలను తీసుకురావడం చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తానా అంటే రాష్ట్ర ప్రభుత్వం తందానా అంటుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు శాపంగా మారుతున్న జీవో నెంబర్ 21 ను రద్దు చేయాలని రైతు పొలాల్లో బోరు బావుల దగ్గర ఉచిత కరెంటు బదులు నగదు బదిలీ పథకం పేరుతో స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులకు గురవుతున్నారు. మినిమం కరెంటు చార్జి బిల్లు 3000 నుండి నెలకు 6000 వస్తుంది అందుకు రైతులకు శాపంగా మారుతున్న స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను బస్ ఛార్జీలను పెట్రోల్ డీజిల్ చార్జీలను నిత్య వస్తువుల చార్జీలను విపరీతంగా పెంచి రైతులకు శాపంగా మారుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనింపే రోజులు దగ్గర పడ్డాయని వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో AISF జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరంగ CPI నాయకులు  AIKS రైతు సంఘం నాయకులు ఇనాహిత్ వీరేష్ వెంకటేష్ కాలింగ జంబన్న  తదితరులు పాల్గొన్నారు.

About Author