NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రాంతీయ భాషల్లో చట్టాలు రాయాలి

1 min read

పల్లెవెలుగువెబ్ : కొత్త చట్టాలను సరళమైన పద్ధతిలో, ప్రాంతీయ భాషల్లో రాయాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పేద ప్రజలు కూడా వాటిని అర్థం చేసుకునేలా ఉండాలన్నారు. న్యాయ వ్యవస్థలో ప్రాంతీయ భాషలను వాడాలని అభిప్రాయపడ్డారు. శనివారం గుజరాత్‌లోని కెవడియాలో ‘స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ’ సమీపంలో అఖిల భారత న్యాయ మంత్రులు, కార్యదర్శుల రెండు రోజుల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వీడియో సందేశంలో న్యాయ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం జరగడంలో ఆలస్యమవడం పెద్ద సవాల్‌ అని పేర్కొన్నారు. సమర్థవంతమైన దేశానికి, సామరస్య సమాజానికి సున్నితమైన న్యాయ వ్యవస్థ ఆవశ్యకమన్నారు. చట్టపరమైన భాష ప్రజలకు అవరోధంగా మారకూడదన్నారు. తన ఎనిమిదేళ్ల పాలనలో 1500పైగా పాత, అనవసర చట్టాలను రద్దు చేశామని, వీటిలో చాలా వరకూ బ్రిటిష్‌ పాలన కాలం నుంచి ఉన్నాయని తెలిపారు.

           

About Author