NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లాయ‌ర్ ఫీజు రూ. 96 ల‌క్షలా.. హైకోర్టులో పిటిష‌న్..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: సీనియ‌ర్ న్యాయ‌వాది నిరంజ‌న్ రెడ్డికి 96 ల‌క్షల ఫీజు చెల్లించేందుకు ప‌రిపాల‌న అనుమ‌తి ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 239ని స‌వాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ఏపీ న్యాయ‌వాదుల ర‌సుము నిబంధ‌న‌-43ను ఉల్లంఘించేదిగా ఆ జీవో ఉంద‌ని న్యాయ‌వాది క‌మ‌లారాణి పిటిష‌న్ వేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో చ‌ట్టబ‌ద్దమైన‌ది కాద‌ని న్యాయ‌వాది క‌మలారాణి పిటిష‌న్ లో పేర్కొన్నారు. రాజ‌ధాని రైతుల కేసులో ప్భుత్వం త‌ర‌పున వాదించినందుకు నిరంజ‌న్ రెడ్డికి 96 ల‌క్షల ఫీజు చెల్లించేందుకు అనుమ‌తి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింద‌ని పేర్కొన్నారు. ఈనెల 10న హైకోర్టులో ఈ పిటిష‌న్ మీద విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

About Author