నేరస్థుడితో లాయర్ `లిప్ లాక్ కిస్` !
1 min readపల్లెవెలుగువెబ్ : అర్జెంటీనాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ చుబుట్ ప్రావిన్స్‌లోని ఓ మహిళా న్యాయమూర్తి, నిందితుడు జైల్లో రొమాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వీరిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. డెయిలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఘటన అర్జెంటీనాలో డిసెంబరు 29న చోటుచేసుకుంది. ఇందులో ఓ పోలీస్ అధికారిని హత్య చేసి జైలులో ఉన్న క్రిస్టియన్ ‘మై’ బస్టోస్ అనే ఖైదీని.. న్యాయమూర్తి మారియల్ సువారెజ్ ముద్దుపెట్టుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటీజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరోవైపు మహిళా న్యాయమూర్తి ఖైదీని ముద్దు పెట్టుకుంటున్న వీడియో బయటపడడంతో దీనిపై విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి తెలిపారు.