ప్రముఖ న్యాయవాది పెడబల్లి శేఖర్ రెడ్డి మృతి
1 min readపల్లెవెలుగువెబ్, చెన్నూరు: కడప నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది. చెన్నూరు వాసి పెడబల్లి శేఖర్ రెడ్డి 73. అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. న్యాయవాది మృతి విషయం తెలుసుకున్న కడప నగరానికి చెందిన న్యాయవాదులు. పలువురు ప్రముఖులు ఆత్మీయులు. పలువురు రాజకీయ నాయకులు చెన్నూర్ లో రెడ్డి వారి వీధి లోని న్యాయవాది శేఖర్ రెడ్డి నివాసంలో భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ భాస్కర్ రెడ్డి. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు. కమలాపురం శాసనసభ్యుడు. పి రవీంద్ర నాథ్ రెడ్డి. చెన్నూరు కు చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జిఎ న్ భాస్కర్ రెడ్డి. మాజీ సింగిల్విండో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి. చెన్నూరు మండలానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు శేఖర్ రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. న్యాయవాది శేఖర్ రెడ్డి కడప జిల్లా కోర్టులో న్యాయవాది గాను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాను పని చేశారు. ఈయన పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం బుజ్జాయి పల్లి లో వివాహం చేసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి తో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పులివెందుల నియోజకవర్గంలో బంధువర్గం ఏర్పరుచుకున్నారు. న్యాయవాది శేఖర్ రెడ్డి మృతికి నివాళులర్పించేందుకు బంధువులు ఆత్మీయులు రాజకీయ నాయకులు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సాయంత్రం చెన్నూరు పెన్నా నదిలో న్యాయవాది శేఖర్ రెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి.