న్యాయవాదులు విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి
1 min readభారతదేశం ప్రెసిడెంట్ బి. రంగస్వామి.
బార్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకున్న యువ న్యాయవాది తలారి రవి కుమార్.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: న్యాయవాద వృత్తిలోకి వచ్చే జూనియర్ న్యాయవాదులు నిరంతరం విషయ పరిజ్ఞానం పెంచుకోవడంతో పాటు అంకితభావంతో కృషి చేస్తే వృత్తిపరంగా రాణిస్తారని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగస్వామి, సీనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి, మైరాముడు, సత్యనారాయణ, రమేష్ బాబు సూచించారు. శుక్రవారం పత్తికొండ మండలము పులికొండ గ్రామానికి చెందిన “తలారి రవి కుమార్” అనే యువ న్యాయవాది పత్తికొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.రంగస్వామి మరియు సీనియర్ న్యాయవాదుల సమక్షంలో బార్ అసోసియేషన్ లో నూతనంగా సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, న్యాయవాదులు రెగ్యులర్ గా కోర్టు కు హాజరై , కేసుల పట్ల విషయ పరిజ్ఞానం పెంపొందించుకుని కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. న్యాయవాదులు నిత్య విద్యార్థులుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి, మైరాముడు, సత్యనారాయణ, హెచ్ కే లక్ష్మన్న, ఆవుల శేఖర్, నాగభూషణంరెడ్డి, ఈరన్న, మల్లికార్జున, రమేష్ బాబు, కృష్ణయ్య, నరసింహయ్య, సోమప్ప, పంపాపతి,మహేష్, రవి ప్రకాష్, రాజశేఖర్ నాయుడు, రవికుమార్, వాసు, శ్రీనివాసరెడ్డి, ప్రసాద్ బాబు, శ్రీకాంత్ రెడ్డి, మధు బాబు, వెంకటేశ్వర్లు, అరుణ్ కుమార్, హలిగెర రామాంజిని, బోయ మధు, నాగరాజు, హరికృష్ణ, కవిరెడ్డి రాజశేఖర్ పాల్గొన్నారు.