NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యుత్ సబ్ స్టేషన్ కు దారి చూపండి.. మహాప్రభో…!

1 min read

పల్లెవెలుగు వెబ్​, మహానంది : కర్నూలు జిల్లా మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ కు దారి చూపండి మహాప్రభో… అంటూ వేడుకుంటున్నారు రైతులు. మూడు సంవత్సరాల క్రితం వచ్చిన తుఫాను వరదల కారణంగా ప్రభుత్వ ఆదర్శ పాఠశాల సమీపంలోని విద్యుత్ సబ్​స్టేషన్​లోకి ప్రవేశించే దారిలో ఉన్నటువంటి కల్వర్లు కూలిపోవడంతో అప్పటినుండి నేటి వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపవిద్యుత్ సబ్ స్టేషన్ నుండి రైతులకు ఉపయోగపడే విద్యుత్ సామాగ్రి అక్కడి నుండి తరలించాలన్నా… ప్రధాన విద్యుత్ కేంద్రం నుండి వచ్చే పరికరాలను ఉప విద్యుత్ కార్యాలయం లోనికి చేర్చాలన్న చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.


వర్షాకాలం అవస్థలు..!
వర్షాకాలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చెడిపోయిన వాటి భాగాలు ఉప కేంద్రం నుంచి తరలించాలంటే అనేక వ్యయ ప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా ఆదర్శ పాఠశాల రహదారిని ఉపయోగించుకుంటున్న విద్యుత్ ఉపకేంద్రం లోనికి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు కూడా ఏమి చేయలేక రైతులకు ఉపయోగపడే విద్యుత్ పంపిణీ చేసే సామాగ్రిని ఇతర ఉప విద్యుత్ కేంద్రాల నుంచి తీసుకొని రావాలంటే రైతులకు మరియు విద్యుత్ సిబ్బందికి భారంగా మారుతున్నట్లు సమాచారం.

About Author