NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోడి, క్వార్ట‌ర్ మ‌ద్యం పంపిణీ చేసిన నేత !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: టీఆర్ఎస్ జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైన వేళ‌… వ‌రంగ‌ల్ ఈస్ట్ నియోజ‌కవ‌ర్గానికి చెందిన టీఆర్ఎస్ నేత రాజ‌నాల శ్రీహ‌రి చేసిన ప‌ని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది. వ‌రంగ‌ల్‌లో న‌డిరోడ్డుపై కేసీఆర్‌తో పాటు కేటీఆర్ క‌టౌట్ల‌ను ఏర్పాటు చేసిన శ్రీహ‌రి.. ఆ క‌టౌట్ల ముందు రెండు టేబుళ్లు వేసుకుని నిల‌బ‌డ్డారు. త‌న అనుచ‌రుల‌తో క‌లిసి ఆ టేబుళ్ల‌పై కోళ్ల‌తో పాటు క్వార్ట‌ర్ మ‌ద్యం బాటిళ్ల‌ను పేర్చేశారు. అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌తి పేద‌వాడికి ఓ కోడితో పాటు క్వార్ట‌ర్ మ‌ద్యం బాటిల్ ఇస్తానంటూ ఆయ‌న అనుచ‌రులు అప్ప‌టికే పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశారు.

                                               

About Author