NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ఐని కలిసిన వడ్డెర సంఘం నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు నూతన ఎస్సై ఎం.జగన్ మోహన్ ను వడ్డెర సంఘం రాష్ట్ర మరియు జిల్లా నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఈనెల 19వ తేదీన పీరు సాహెబ్ పేట గ్రామంలో వడ్డెరులపై జరిగిన గొడవ గురించి ఎస్సైతో మాట్లాడినట్లు అదేవిధంగా గ్రామంలో అందరూ కలిసి కట్టుగా ఉంటూ గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శి పీట్ల శివశంకర్ మరియు నంద్యాల జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు చక్రధర్ ఎస్సైని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.సంఘం నాయకులు ఎస్సైని శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సంఘం తాలూకా అధ్యక్షులు శివమణి, పట్టణ అధ్యక్షులు సురేష్,రాము మరియు తదితర సంఘం నాయకులు పాల్గొన్నారు.

About Author