NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్ఐ కి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

1 min read

– ఎస్ఐ కి శుభాకాంక్షలు తెలిపిన నాయకుల

– దేవనూరు నిందితులు రిమాండ్ కు తరలింపు

 పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ ఎం.జగన్ మోహన్ ను మండల పరిధిలోని చౌటుకూరు గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం ఐక్యవేదిక నంద్యాల జిల్లా అధ్యక్షులు సయ్యద్ సాదిక్ అలీ మంగళవారం ఉదయం ఎస్ఐ ని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.గత నెల సెప్టెంబర్ 16వ తేదీన బాధ్యతలు చేపట్టిన ఎస్సై అప్పటి నుంచి వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు పూల బొకేలు అందజేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. తర్వాత దేవనూరు గ్రామంలో గ్రామానికి చెందిన దండుగుల మధు శేఖర్ ప్రతిరోజు మద్యం సేవించి చిత్ర హింసలకు గురి చేయడం వల్ల ఈనెల ఆరవ తేదీన ఉదయం మధు శేఖర్ భార్య దండుగుల రాజేశ్వరి  పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలిసిందే.భర్త మధు శేఖర్ మామ తిమ్మన్న వీరిద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్సై జగన్ మెహన్ తెలిపారు.శాంతి భద్రతల పట్ల రాజీ పడే ప్రసక్తే లేదని అంతేకాకుండా మండలంలోని సమస్యాత్మక  గ్రామాలపై దృష్టి సారిస్తామని ఎస్సై తెలిపారు.

About Author