పదో తరగతి ప్రశ్నాపత్రాల లీక్.. ప్రభుత్వం సీరియస్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీలో పదో తరగతి పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఘటనలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాల్ ప్రాక్టిస్‌లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందిదే ప్రధాన పాత్రగా తేల్చారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ కూడా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు పదో తరగతి పరీక్షా పత్రాల మాల్‌ప్రాక్టీస్‌లో తిరుపతి నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ గిరిధర్‌రెడ్డిని నిందితుడిగా గుర్తించారు. తిరుపతి ఎన్‌ఆర్‌ఐ కాలేజ్ లెక్చరర్ సుధాకర్‌ను నిందితులుగా గుర్తించారు. వీరిద్దరిపై కేసులు నమోదు చేశారు.