సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ వద్ద లీకేజ్..
1 min read
శతవిధాల శ్రమిస్తున్న ఎమ్మెల్యే చంటి, కో-ఆప్షన్ సభ్యులు పెద్దబాబు
ఏలూరు, న్యూస్ నేడు: ఏలూరు నగర ప్రజలకు మంచినీటిని అందించే దెందులూరు సమీపంలోఉన్న గోదావరి జలాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లీకేజీపడిందిఈ విషయం తెలిసిన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులుఎస్ఎంఆర్ పెదబాబు తెల్లవారుజామునే పంపులు చెరువు వద్దకు చేరుకొని.జెసిబి లు ఇసుక బస్తాలు రప్పించి అధికారులను అలర్ట్ చేసి యుద్ధ ప్రాతిపాదికన లీకేజీ అడ్డుకట్ట చర్యలు తీసుకుంటున్నారు.నగరపాలక సంస్థ కమిషనర్,మున్సిపల్ ఎంఈ,డిఇ లు, ఏఈలు టూ టౌన్ పరిధిలో ఉన్న శానిటేషన్ ఎస్ఎస్, ఇన్స్పెక్టర్లు,మేస్త్రిలు అధికారులు అందరూ అక్కడ చేరుకొని యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకుంటున్నారు. ఫ్లెక్సీలు,ఇసుక బస్తాలు,మట్టి, రాళ్లు,పలుకులు,పారలు, అన్ని రకాల వనరులు ఉపయోగిస్తూ లీకేజీ అరెస్టుకు శత విధాల సాయిశక్తుల శ్రమిస్తున్నారు.
