ఏపీ టూరిజం రెస్టారెంట్ల లీజుకు…31న వేలంపాట
1 min readజిల్లా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ అధికారి పి.విజయ
పల్లెవెలుగు: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామంలోని ఏపీ టూరిజం రెస్టారెంట్ ను, కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలోని శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయం వద్ద నున్న ఏపీ టూరిజం రెస్టారెంట్, కర్నూలు మండలం సుంకేసుల గ్రామంలోని ఏపీ టూరిజం రెస్టారెంట్ల లీజుకు సంబంధించి ఈ నెల 31నవేలం పాట నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ అధికారి పి. విజయ బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కర్నూలు జిల్లాలోని (1) ఓర్వకల్ (మo), కేతవరం (గ్ర), లో ఉన్న ఏ.పి. టూరిజం రెస్టారెంట్ ను 15 సంవత్సరాల కాలపరిమితితో మరియు (2) కౌతాళo మండలము, ఉరుకుంద (గ్ర) మునకుచెందిన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి గుడి వద్ద గల ఏ.పి. టూరిజం రెస్టారెంట్ ను 33 సంవత్సరాలు మరియు కర్నూలు (మo), సుంకేశుల (గ్ర) వద్ద గల ఏ.పి. టూరిజం రెస్టారెంట్ ను 33 సంవత్సరాల కాలపరిమితితో బహిరంగ వేలం ద్వారా లీజుకు ఇచ్చుటకు బహిరంగ వేలం పాటను ఆగస్టు 31న ఏ.పి. టూరిజం అథారిటి కార్యాలయములో 1st floor, DWMA కార్యాలయము ప్రక్కన, Collectorate complex, కర్నూలు నందు బహిరంగ వేలం పాట నిర్వహించబడును. లీజుకు తీసుకున్నవారు ప్రస్తుతం నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన రెస్టారెంట్ యొక్క నిర్మాణంను పూర్తి చేసి, అభివృద్ది చేసి పర్యాటకులకు వసతులు ఏర్పాటు చేసి నిర్వహించుకోవాల్సి ఉంటుందని తెలుపడమైనది. వేలం పాటలో పాల్గొను వారు రూ.10,000/-(అక్షరాల పది వేల రూపాయలు మాత్రమే) ధరావత్తును Demand Draft రూపేణ “District Collector & Chairman, District Tourism Council, Kurnool” వారి పేరిట తీసి వేలం పాటకు ఒక రోజు ముందు సాయంత్రం 5 గంటలలోపు జిల్లా పర్యాటక & సాంస్కృతిక ఆధికారి పి. విజయ వెల్లడించారు. ఇతర వివరాలకు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్స్ 8247704152, 6309942034, 8332848986.
లీజుకు ఇచ్చు టూరిజం project వివరాలు:
1. కేతవరం పాచీన రాతి చితాల వద్ద నిర్మించిన ఏ.పి.టూరిజం రెస్టారెంట్ ను 15 సం..రాల కాలపరిమితితో తేది31.08.2023
ఉదయం’11.30 గంటలకు
2. ఊరుకుంద ఈరన్న స్వామి దేవస్థానం వద్ద నిర్మించిన ఏ.పి.టూరిజం రెస్టారెంట్ ను నడుపుకొనుటకు 33 సం..రాల కాలపరిమితితో తేది:31.08. 2023
ఉదయం’12.00 గంటలకు
3 సుంకేశుల వద్ద నిర్మించిన ఏ.పి.టూరిజం రెస్టారెంట్ ను నడుపుకొనుటకు 33 సం..రాల కాలపరిమితితో తేది: 31.08. 2023
ఉదయం’12.30 గంటలకు