NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏ ఒక్క‌రినీ వ‌దిలిపెట్ట‌ను !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నారా లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. త‌న త‌ల్లిని కించ‌ప‌రిచిన ఏ ఒక్క‌రినీ వ‌దిలిపెట్ట‌న‌ని తెలిపారు. ‘‘నా వ్యక్తిగత జీవితంపై కూడా సాక్షి మీడియా బురద జల్లింది. సాక్షి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. వేటికీ భయపడను..తప్పుడు వార్తలు రాస్తే చట్ట ప్రకారం ముందుకెళ్తా. అసెంబ్లీ సాక్షిగా నా తల్లిని కించపర్చేలా మాట్లాడారు. విజయలక్ష్మి, భారతి, వారి పిల్లల గురించి మేం మాట్లాడితే.. ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. కానీ అది మా మా సంస్కృతి కాదు. ఓ తల్లి బాధ ఎలా ఉంటుందో కొడుకుగా చూశాను. నా తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను. మాపై అసత్య కథనాలు ప్రచురించారు. సాక్షి సహా మూడు మీడియా సంస్థలపై కేసు పెట్టారు. దివీక్‌ క్షమాపణలు కోరిందని.. సాక్షి, దక్కన్‌ క్రానికల్‌ మాత్రం వివరణ కూడా ఇవ్వలేదన్నారు. మొదటి నుంచీ సాక్షి మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోంది’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

                                

About Author