పక్షపాత రాజకీయాలను పక్కనపెట్టండి !
1 min read
పల్లవెలుగువెబ్ : పార్టీలు పక్షపాత రాజకీయాలను పక్కనపెట్టాలని రాష్ట్రపతిగా పదవీ విరమణ చేయనున్న రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. ప్రజల సంక్షేమం కోసం అత్యవసరమయ్యే విషయాలపై సమాలోచనలు జరపాలని సూచించారు. శనివారం పార్లమెంటు సెంట్రల్ హాలులో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో ఆయన ప్రసంగించారు. పార్లమెంటును ‘ప్రజాస్వామ్య దేవాలయం’గా అభివర్ణించిన ఆయన ఎంపీలు తాము ఎన్నుకొన్న ప్రజల అభీష్టాన్ని ఇక్కడ వ్యక్తం చేయాల్సి ఉంటుందని చెప్పారు. పార్లమెంటరీ వ్యవస్థ పెద్ద కుటుంబంలాంటిదని చెబుతూ కుటుంబంలో భిన్నాభిప్రాయాలు సహజమే అన్నా రు. వీటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని పార్టీలకు హితవు చెప్పారు. తమ వ్యతిరేకతను తెలపడానికి రాజకీయ పార్టీలు మహాత్మాగాంధీ అనుసరించిన శాంతి, అహింస మార్గాలు అనుసరించి లక్ష్యాలను సాధించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.