ఎడమ కాలువ పొడిగింపు పనులను చేపట్టాలి.. డి.రాజా సాహెబ్
1 min read
నలకదొడ్డిలో సంతకాల సేకరణ చేసిన సిపిఐ నాయకులు
పత్తికొండ, న్యూస్ నేడు: పందికోన హంద్రీనీవా రిజర్వాయర్ కింద ఉన్న ఎడమ కాలువ పొడిగింపు పనులను తక్షణమే చేపట్టాలని సిపిఐ మండల కార్యదర్శి డి. రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మయ్య డిమాండ్ చేశారు.సిపిఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని నలకదొడ్డి, అటికెల గుండు గ్రామాల లో రైతులను కలుసుకొని మంగళవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పందికోన రిజర్వాయర్ కింద ఉన్న ఎడమ కాలువ ను హోసూరు నుండి పెద్దహుల్తి, చిన్నహుల్తి, దేవనబండ, అటికెల గుండు, నలక దొడ్డి, జూటూరు గ్రామాల మీదుగా ఆస్పరి మండలం బిల్లేకల్, వెంగలాయ దొడ్డి వరకు పొడిగించి పనులను పూర్తి చేసినట్లయితే 20 వేల ఎకరాలకు సాగునీరు, ఆయా గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. ఎడమ కాలువను పొడిగించాలని కోరుతూ ఈనెల 28న గ్రామ వార్డు సచివాలయాల ఎదుట తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి సిద్ద లింగప్ప, నలక దొడ్డి సిపిఐ శాఖ కార్యదర్శి భక్షాల ఈరన్న, నాయకులు జగదీష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.