ఎడమ చేతి అలవాటు.. ఎలా వస్తుందో తెలుసా ?
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రపంచంలో చాలా మందికి ఎడమచేతి అలవాటు ఉంటుంది. ఎడమ చేతితో ఆడటం, ఎడమ చేతితో తినడం, ఎడమ చేతితో రాయడం చాలా మందికి పుట్టుకతోనే వస్తుంది. అయితే.. ఈ ఎడమ చేతి అలవాటు ఎలా వస్తుందన్న దానిపై శాస్త్రవేత్తలు పలు కారణాలను విశ్లేషిస్తారు. ఎడమ చేతి అలవాటు ఓ జెనటిక్ డిసార్డర్ అని, వీళ్లు రోగనిరోధక శక్తి సంబంధిత వ్యాధులతో చనిపోతారని అప్పట్లో ఓ నమ్మకం ఉండేది. ఎడమ చేతి అలవాటు పుట్టుకతోగానీ, బలవంతంగా వచ్చేది కాదని, అది శరీర అంతర్ణిర్మాణం పై ఆధారపడుతుందన్న ఒక కారణం మాత్రం సైంటిస్టులు చెబుతుంటారు. మానవ మెదుడు కుడి, ఎడమ గా రెండు అర్ధ భాగాలుగా ఉంటుంది. కుడి వైపు శరీర భాగాన్ని మెదడు ఎడమ అర్ధ భాగం నియంత్రిస్తుంది. అలాగే ఎడమ వైపు శరీర భాగాన్ని మెదడు కుడి వైపు అర్ధ భాగం నియంత్రిస్తుంది. అంటే మెదడు కుడి అర్ధ భాగం బలంగా ఉన్న వారిలో ఎడమ చేతివాటం రావొచ్చనే అభిప్రాయం చాలా మంది సైంటిస్టుల్లో ఉంది. జెనిటిక్ ఎఫిషియన్సీ పై కూడ ఆధారపడి ఉండవచ్చని చాలా మంది సైంటిస్టులు భావిస్తారు. ఎడమ చేతివాటం ఎలా వస్తుందనే దానికి ఇప్పటి వరకు స్పష్టమైన కారణాలు శాస్త్రవేత్తలు కనుగొనలేదు.