వైస్సార్సీపీ పార్టీని వీడి టీడీపీలో చేరిక
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం కొలిమిగుండ్ల మండలం కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన వెంకటేశ్వర రావు(మాజీ సర్పంచ్)గారితో పాటు మరో 25 కుటుంబాలను టీడీపీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించిన బీసీ జనార్దన్ రెడ్డి గారు .కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, ఆదినారాయణ స్వామి,నరసయ్య, నాగేశ్వరరావు, డి హుస్సేన్, y.రాజా, T. వెంకటేష్, లక్షుంపల్లె గ్రామం కొండలరావు (వాలంటరీ ) 25 కుటుంబాలను బనగానపల్లె నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు బీసీ జనార్దన్ గారు ఆధ్వర్యంలో టిడిపి పార్టీలోకి టీడీపీ పార్టీ లోకి టీడీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ వైసిపి పాలన పై ప్రజలు విసిగిత్తి తెలుగుదేశం పార్టీలోచేరడానికి సిద్ధమవుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక అన్ని రకాల వస్తువుల ధరలు, చార్జీలుపెరిగిపోయిజనంఇబ్బందులుపడుతున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఇలాంటి చేరికలు భారీ స్థాయిలో ఉంటాయని బీసీ జనార్దన్ రెడ్డి గారు తెలిపారు. గ్రామంలోని పార్టీ కార్యకర్తలు అంతా కలిసి మెలిసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగిరేల కృషి చేయాలని సూచించారు.